ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లెన్ మాక్స్వెల్ తమిళనాడుకు చెందిన విని రామన్ అనే యువతిని పరిణయమాడాడు. క్రైస్తవ, తమిళ సంప్రదాయం ప్రకారంగా రెండు పద్ధతుల్లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా మాక్స్వెల్ సాంప్రదాయం ప్రకారం క్రైస్తవ పద్దతిలో పెళ్లి చేసుకోగా.. తరువాత తమిళ సంప్రదాయంలో వీళ్ళ వివాహం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎంతో సందడిగా, ఆనందంగా ఒక్కటైన ఈ జంటను చూసి మాక్స్వెల్ ఫ్యాన్స్, నెటిజన్లు ఎంతో సంబరపడిపోతున్నారు.