బిగ్ బాస్ బ్యూటీ, నటి మోనాల్ గజ్జర్ పుట్టిన రోజు ఇవాళ. 1991 మే 13న గుజరాతీ ఫ్యామిలీలో అహ్మదాబాద్ లో ఈ భామ జన్మించింది. హీరో నరేష్ నటించిన సుడిగాడు సినిమాతో 2012లో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత గుజరాతీ, తమిళ్, మరాఠీ భాషల్లో పలు సినిమాలు చేసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో ఈ బ్యూటీ పాల్గొన్న తర్వాత తెలుగులో మరింత ఫేమస్ అయ్యింది. తన క్యూట్ లుక్స్, హాట్ అందాలు, తనదైన యాక్టింగ్ తో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ అమ్మడు బర్త్ డే సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు.