ఇండియాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూ పోతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 3,805 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో(3,545) పోల్చుకుంటే కేసుల సంఖ్య 7.3 శాతం మేర పెరిగింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 20 వేలు దాటింది. ప్రస్తుతం 20,303 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 27 మంది కరోనా కారణాలతో మరణించారు. ఢిల్లీలోనే 2,272 కరోనా కేసులు నమోదయ్యాయి.