మెదక్ జిల్లా సంక్షేమ శాఖలో పనిచేసే ఒక ఉద్యోగి..అదే ఆఫీసులో పనిచేసే ఒక మహిళా కాంట్రాక్టు ఉద్యోగితో అసభ్యంగా ప్రవర్తించాడు. తనను ఉద్యోగంలో కొనసాగించేలా సంతకం చేయాలని అడిగిన ఆమెతో.. నా కోరికలను తీర్చు, అప్పుడు సంతకం పెడతా, అంతేకాదు నీకు పని ఎక్కువ లేకుండా మహారాణిలా చూసుకుంటానని చెప్పాడు. మార్చిలో జరిగిన ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్నిఆ ఉద్యోగి మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్శదర్శి దివ్యకు వెల్లడించింది. ఆమె సూచనల మేరకు జిల్లా స్థాయిలో కమిటీ విచారణ చేపట్టినట్లు మహిళా ఉద్యోగి తెలింది.