ఉక్రెయిన్లోవైద్య విద్యను అభ్యసిస్తున్న ఇండియన్ విద్యార్థుల విషయంలో నెలకొన్న అనిశ్చితి విషయంలో జోక్యం చేసుకోవాలని IMA (ఇండియన్ మెడికల్ అసోసియేషన్) ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో కోరింది. ఉక్రెయిన్లో యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో అని.. తిరిగి ఎప్పుడు సాధారణ పరిస్థితులు నెలకుంటాయోనని అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. అక్కడ వివిధ దశల్లో చదువుతున్న ఇండియన్ విద్యార్థులను భారతీయ వైద్య కళాశాలల్లో సర్దుబాటు చేసేలా చూడాలని కోరింది.