సీనియర్ నటి మీనా భర్త విద్యాసాగర్ మృతికి పావురాల నుంచి వచ్చిన ఇన్ఫెక్షన్ కారణమని తమిళ మీడియాలో పేర్కొన్నారు. మీనా కుటుంబం నివసించే ఇంటి సమీపంలో చాలా పావురాలు ఉంటాయి. వాటి వల్ల కలుషితమైన గాలి పీల్చడంతో..ఇంట్లో అందరికీ ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకినట్లు సమాచారం. అయితే విద్యాసాగర్ గతంలో కొవిడ్ బారిన పడటంతో ఆయనకు తీవ్రత మరింత పెరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చికిత్స చేస్తుండగా… తుదిశ్వాస విడిచారని పలు వార్తా కథనాల్లో పేర్కొన్నారు.