తెలంగాణ ప్రభుత్వ మంత్రి వర్గం నేడు భేటీ కానుంది. రేపు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సమావేశాల నిర్వహణపై కేబినేట్లో చర్చించనున్నారు. తెలంగాణ వార్షిక బడ్జెట్ రూ. 2.5 లక్షల కోట్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. రేపు ఉదయం ఆర్థిక మంత్రి హరీష్ రావు సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. కేబినేట్లో వివిధ సంక్షేమ పథకాల గురించి చర్చించనున్నారు. పోలీసులు కూడా రేపటి బడ్జెట్ సమావేశాల కోసం కట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపడుతున్నారు.