నేడు హైదరాబాద్ నిజాం కాలేజీలో యూజీ, పీజీ విద్యార్థుల కోసం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. దాదాపు 3,500 ఉద్యోగాల భర్తీ కోసం సుమారు 30కి పైగా సంస్థలు హాజరుకానున్నట్లు కాలేజ్ ప్రిన్సిపల్ తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, బీటెక్, పీజీ చేసిన అభ్యర్థులు హాజరుకావాలని సూచించారు. అనుభవం ఉన్నవారు కూడా పాల్గొనవచ్చని వెల్లడించారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఈ జాబ్ మెళా ఉంటుందని చెప్పారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు https://forms,gle/kz dqMzPCfpUDPKun7లో వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు.