చాలా రోజుల నుంచి సినిమాల విషయంలో తెలుగు, హిందీ అనే వివాదం నడుస్తూనే వస్తోంది. ఈ వివాదం ఇప్పుడు మొదలు కాలేదు. ఇప్పుడు దీనికి ఎండ్ కార్డు కూడా పడతుందని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయడం లేదు. కానీ ఆచార్య మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడిన మాటలు తెలుగు ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేశాయి. 1988 వ సంవత్సరంలో రుద్రవీణ సినిమాకు అవార్డు తీసుకునేందుకు ఢిల్లీకి వెళ్లినపుడు.. అక్కడ ఓ హోటల్ లో టీ తాగుతుంటే హోటల్ గోడలకు ఇండియన్ సినిమా చరిత్రను తెలిపే విధంగా అలంకరించబడి ఉందని.. కానీ ఆ పోస్టర్లలో ఒక్కరంటే ఒక్కరు కూడా తెలుగు నటులు లేకపోవడం తాను అవమానంగా ఫీలయ్యానని చెప్పుకొచ్చాడు. ఒకానొక సందర్భంలో ఇండియన్ సినీ పరిశ్రమ అంటే బాలీవుడ్ మాత్రమే అన్నట్లు చూసేవారని.. కానీ సౌత్ నుంచి బాహుబలి, RRR వంటి సినిమాలు వచ్చిన తర్వాత ప్రస్తుతం పరిస్థితి మారిందని అన్నారు.
AP News
సొంత పార్టీ నేతలపై కోటం రెడ్డి తీవ్ర విమర్శలు