తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హజరయ్యారు. అయితే చిరంజీవి స్పీచ్ ఇస్తున్నప్పుడు తాప్సీపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఝుమ్మంది నాదం ఘూటింగ్‌లో నిన్ను చూసినప్పుడు ఎంత బాగుంది అమ్మాయి, ఒకసారి కలిసి పనిచేయానుకున్నాను. కానీ అప్పుడు రాజకీయాల్లో ఉన్నాను. ఇలాంటి వాళ్లను చూసినప్పుడు అసలు రాజకీయాల్లోకి ఎందుకు వెళ్లానా అనిపిస్తుంది. మనిద్దరం కలిసి ఒక సినిమా చేద్దాం. కానీ నువ్వు పింక్, బద్లా సినిమాల్లో, యాక్టింగ్‌లో అమితాబ్‌ను డామినేట్ చేసినట్లు నన్ను చేస్తే బాగుండదు అని సరదాగా అన్నాడు. దానికి తాప్సీ థ్యాంక్యూ సర్ అని చెప్పింది. మెగాస్టార్ చిరంజీవి తాప్సీపై చేసిన ఫన్నీ కామెంట్స్‌ను మీరు కూడా ఒకసారి చూసేయండి.