మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు హరీశ్ శంకర్ డైరెక్షన్లో ఓ సినిమాలో నటించబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘బ్రోడాడీ’ చిత్రాన్ని తెలుగులో చిరంజీవితో రీమేక్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. తండ్రిగా చిరంజీవి కొడుకుగా మరో యువ హీరో కోసం పరిశీలిస్తున్నారట. ప్రస్తుతం హరీశ్ శంకర్ పవర్‌స్టార్‌తో భవదీయుడు భగత్‌సింగ్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. చిరంజీవి కూడా వరుసగా గాడ్ ఫాదర్, బోళా శంకర్, బాబీ దర్శకత్వంలో, వెంకీ కుడుములతో ఇలా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇవి పూర్తయిన తర్వాత హరీశ్ శంకర్‌తో ఈ సినిమా చేస్తాడని టాక్ వినిపిస్తుంది.