చిరంజీవీ ఆచార్య సినిమా డిజాస్టర్ తర్వాత ఆలోచనలో పడ్డాడు. మరోసారి ఇలాంటి తప్పిదం జరిగేందుకు వీల్లేదని దృఢంగా నిశ్ఛయించుకున్నాడు. అందుకే ప్రస్తుతం ఫోకస్ అంతా బాబి దర్శకత్వంలో నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాపై పెట్టాడు. ఇప్పటికే గాడ్‌ఫాదర్, భోళాశంకర్ వంటి సినిమాలు చేస్తున్నప్పటికీ అవి రీమేక్ సినిమాలు. అందుకే కొత్త సినిమాతోనే మళ్లీ ఫామ్‌లోకి రావాలని అనుకుంటున్నాడట. అందుకే మొదట వాల్తేరు వీరయ్యను రిలీజ్ చేసి ఆ తర్వాత రెండు రీమేక్ సినిమాను విడుదల చేసే ఆలోచనటో ఉన్నట్లు సమాచారం.