ఆహా ఓటీటీలో బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ టాక్‌షో కారణంగా ఆహా ఓటీటీ సబ్‌స్క్రైబర్స్ భారీగా పెరిగారట. అయితే త్వరలో అన్‌స్టాపబుల్ సీజన్ 2 ప్రారంభమవుతుందని ఆహా ఇది వరకే ప్రకటించింది. దీని గురించి ఆగస్ట్‌లో పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు తెలిపింది. సీజన్ 2 లో మొదటి గెస్ట్‌గా చిరంజీవి రాబోతున్నాడని సమాచారం. మెగాస్టార్‌ను ఫస్ట్ ఎపిసోడ్‌కు తీసుకొచ్చేందుకు అల్లు అరవింద్ సన్నాహాలు చేస్తున్నడట. మరి బాలకృష్ణ, చిరంజీవి కలిసి ఒకే వేదికపై మాట్లాడుతుంటే ఎలా ఉంటుందో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.