పంజాబ్ నేషనల్ బ్యాంకులో వేల కోట్లు ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయిన మెహుల్ చోక్సీ గురించి కొన్ని విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి. కరేబియన్ దేశమైన అంటిగ్వాలో ఉంటున్న చోక్సీ.. భారత్కు రాకుండా ఉండేందుకు ఉన్నతాధికారులకు లంచాలు ఇస్తున్నారట. అతడిని భారత్కు అప్పగించే ఇంటర్పోల్ ప్రయత్నాలకు అధికారులు అడ్డుపడుతున్నారని సమాచారం. న్యాయవిచారణ ఆలస్యంగా జరిగేలా అక్కడివారికి లంచం ఇచ్చాడని టాక్. అక్కడే రెస్టారెంట్ కూడా ప్రారంభించాడట.