ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్థాన్ ఓడిపోవడంపై మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. 1992 ప్రపంచకప్‌లో జరిగినట్లుగానే ఈ సారి కూడా పాక్ ఛాంపియన్‌గా నిలుస్తుందని అభిమానులు భావించారు. కానీ, అలా జరగకపోవడంతో వివిధ రకాలుగా మీమ్స్ వస్తున్నాయి. ఇలా జరగకుండా చేసినందుకు బెన్ స్టోక్స్‌ని ప్రశంసలతో ముంచెత్తుతున్నాయి. ఇంగ్లాండ్ చేతిలో ఓడినా.. పాక్ పరాజయం చెందడంపై ఇండియన్స్ సంబరాలు చేసుకునే తీరుపైనా ప్రస్తుతం మీమ్స్ సందడి చేస్తున్నాయి. అన్ని సార్లు అదృష్టం కలిసి రాదంటూ ‘అయ్యో పాక్’ అని మరికొందరు సానుభూతి చూపిస్తున్నారు.
పాక్ ఓటమిపై నెట్టింట మీమ్స్ సందడి

© ANI Photo