మిస్త్రీ కారు యాక్సిడెంట్‌పై మెర్సిడెస్‌ బెంజ్‌ స్పందన

© ANI Photo

టాటా సన్స్‌ మాజీ ఛైర్మన్ సైరస్‌ మిస్త్రీ కారు ప్రమాదంలో మృతిచెందడంపై ప్రముఖ లగ్జరీ కార్ల తయారీదారు మెర్సిడెస్ బెంజ్‌ స్పందించింది. తాము విచారణకు పూర్తిగా సహకరిస్తున్నామని తెలిపింది. మిస్త్రీ, ఆదివారం మెర్సిడెస్‌ బెంజ్‌ కారులో వెళ్తుండగా మహారాష్ట్రలోని పాల్ఘర్‌ జిల్లాలో ప్రమాదం జరిగింది. ఇందులో మిస్త్రీతో పాటు ఆయన స్నేహితుడు జహంగీర్‌ పండోల్‌ ప్రాణాలు కోల్పోయారు. పోలీసులకు సమస్త సమాచారం అందిస్తున్నామని కార్ల సంస్థ తెలిపింది. తమ బృందం వాహన డేటాను సేకరించిందని, మరింత విశ్లేషణ చేస్తామని పేర్కొంది. ప్రమాదం జరిగిన కారు 2017 GLC 220d 4MATIC,దీని ధర రూ.68లక్షలు, ప్రమాదాల్లో కాపాడేందుకు ఇందులో అనేక సాంకేతికత ఉంది.

Exit mobile version