ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీకి ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు.మెస్సీకి సంబంధించినది ఏదైనా వారికి అపురూపమే. అందుకే మెస్సీ వాడి పడేసిన టిష్యూ పేపర్‌కు అక్షరాల రూ.8 కోట్లు వెచ్చించారు. 2021లో మెస్సీ బార్సిలోనా క్లబ్‌ను వీడినప్పుడు మెస్సీ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు. పక్కనే ఉన్న టిష్యూతో కన్నీళ్లు తుడుచుకుని అక్కడే పడేశాడు. ఆ టిష్యూను ఓ అభిమాని సేకరించి వేలం వేయగా అది ఏకంగా రూ.8 కోట్లు పలికింది.