చిరంజీవి చిన్నకూతురు శ్రీజ కొణిదెల పేరు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఈమె తన భర్త కల్యాణ్ దేవ్‌తో విడిపోయిందని..మూడో పెళ్లికి సిద్ధమవుతోందని అనేక వార్తలు వచ్చాయి. న్యూ ఇయర్ సందర్భంగా సెల్ఫ్ లవ్ అంటూ ఆమె చేసిన పోస్ట్ కూడా ఇందుకు ఆజ్యం పోసింది. తాజాగా మరో ఆసక్తికర పోస్ట్ చేసింది. స్వతహాగా కాఫీ లవర్ అయిన శ్రీజ కాఫీ గురించి రాసుకొచ్చింది. “నా విషాదంలో ప్రశాంతతవు నువ్వు.చీకటిలో వెలుగువు నువ్వు. నా 14 ఏళ్ల వయసులో పరిచయమై అప్పటి నుంచి నా వెన్నంటే ఉంటున్నందుకు థ్యాంక్స్” అంటూ శ్రీజ పోస్ట్ చేసింది.