‘నాటు నాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంతో సంతోషంలో ఉన్న దర్శకుడు రాజమౌళి… హాలివుడ్ అగ్ర దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్‌ను కలిశారు. ‘దేవుడిని కలిశాను’ అంటూ రాజమౌళి తన సంతోషాన్ని పంచుకున్నారు. ఇండియానా జోన్స్ సిరీస్‌తో ప్రపంచమంతా తెలిసిన స్పీల్‌బర్గ్… సినీ ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. అయితే రాజమౌళి ట్వీట్‌పై స్పందిస్తూ… ‘మీరూ ఏం తక్కువ కాదు సర్, పరిమిత వనరులతో అద్భుతాలు సృష్టించారు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.