• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ట్విటర్‌కు పోటీగా ‘మెటా’ యాప్!

    ట్విటర్‌కు పోటీగా ఓ మైక్రో బ్లాగింగ్ సోషల్ నెట్‌వర్క్ యాప్‌ని మెటా తీసుకు రానున్నట్లు తెలుస్తోంది. టెక్ట్స్ అప్‌డేట్‌లను షేర్ చేసేందుకు ఓ యథాతథ నెట్‌వర్క్‌ని డెవలప్ చేయాలని భావిస్తున్నట్లు మెటా ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించలేదు. అయితే, ‘పీ92’ కోడ్ వర్డ్‌తో దీనిని అభివృద్ధి చేస్తున్నట్లు ఓ వెబ్‌సైట్ పేర్కొంది. దీంతో ట్విటర్‌కు ఈ కొత్త సోషల్ నెట్‌వర్కింగ్ యాప్ పోటీ ఇవ్వనుంది. ఇటీవల మెటా బ్లూ టిక్ వెరిఫికేషన్‌ కోసం పెయిడ్ సబ్‌స్క్రిప్షన్‌ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే.