వామ్మో ఈ విషయం తెలుసా. గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో గురువారం అంతరిక్షం నుంచి విచిత్రమైన లోహపు బంతులు నేలపై పడినట్లు చెబుతున్నారు. వాటిని చూసిన గ్రామస్థులు ఆశ్చర్యానికి లోనైనట్లు తెలిపారు. మూడు ప్రదేశాల్లో బంతి ఆకారంలో ఉన్న వస్తువులు పడ్డాయని అంటున్నాారు. గ్రామస్థులు వెంటనే స్థానిక పోలీసులకు ఈ విషయం తెలిపారు. అయితే ఆ వస్తువు దాదాపు 5 కిలోల బరువున్న పెద్ద నల్లని లోహపు బంతిగా ఉందన్నారు. సాయంత్రం 4:45 గంటలకు భలేజ్‌లో పడగా, తర్వాత కొద్దసేపటికి ఖంభోలాజ్, రాంపురాలో ఇలాంటివి పడినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు. వాటి గురించి అధికారులకు తెలిపి మరింత సమాచారం కోసం ఆరా తీస్తున్నారు.