హైదరాబాద్లో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో నగర మేయర్ విజయలక్ష్మి GHMC అధికారులను అప్రమత్తం చేశారు. సహాయక చర్యలు చేపట్టేందుకు సిబ్బంది సమాయత్తం కావాలని తెలిపారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నైరుతి రుతుపవనాల నేపథ్యంలో రాబోవు 48 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలియజేసింది.