• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సమ్మెకు మెట్రో ఉద్యోగులు..స్తంభించిన టికెటింగ్

    హైదరాబాద్- మెట్రో ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. జీతాలు పెంచాలని సమ్మెకు దిగారు. టికెటింగ్ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. అరకొర జీతాలతో పనిచేయలేమని స్పష్టం చేశారు. జీతాల పెంపుపై మెట్రో యాజమాన్యం హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమ్మెతో మియాపూర్- ఎల్బీనగర్ మెట్రో స్టేషన్లలో టికెటింగ్ వ్యవస్థ స్తంభించింది. దీంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. టికెట్లు ఇచ్చేవారు లేకపోవడంతో స్టేషన్ నుంచి వెనుదిరిగి వెళ్తున్నారు. యూపీఐ పేమెంట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు మాత్రం మెట్రోలో ప్రయాణిస్తున్నారు.