హైదారాబాద్లో మెట్రో సేవలను ఎల్బీనగర్ నుంచి హయత్నగర్ వరకూ పొడిగిస్తామని ఐటీ,పురపాలక మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. నాగోల్-ఎల్బీనగర్ లైన్ను అనుసంధానం చేస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికల తర్వాత రెండో ఫేజ్ పూర్తి చేస్తామని చెప్పారు. తెలంగాణలో మళ్లీ వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఎల్బీనగర్ పరిధిలో ‘ముక్తి ఘాట్’ శ్మశాన వాటికను కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు.