తెలంగాణలో పోస్టాఫీసుల్లో మైక్రో ఏటీఎంలు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నగదును వీటి ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా 5118 పోస్టాఫీసుల్లో మైక్రో ఏటీఎంలను ఏర్పాటుచేశారు. ఆధార్ కార్డు, మొబైల్ ఫోన్ తీసుకుకొని పోస్టల్ ఏటీఎంకి వెళ్లాల్సి ఉంటుంది. మొబైల్కు వచ్చే ఓటీపీ ఎంటర్చేసి నగదు తీసుకోవచ్చు. రోజుకు రూ.10 వేలు మాత్రమే పరిమితి. బ్యాంకులు, ఏటీఎంలకు వెళ్లలేని వారికి ఈ సౌకర్యం ఉపయోగకరంగా ఉంటుంది.