హైదరాబాద్‌లో రూ.15వేల కోట్లతో ఏర్పాటు చేస్తున్న మైక్రోసాఫ్ట్ డేటా కేంద్రం 2025 నాటికి అందుబాటులోకి వస్తుందని ఆ సంస్థ CEO సత్య నాదెళ్ల తెలిపారు. మంత్రి KTRతో శుక్రవారం సమావేశమైన ఆయన అనేక విషయాలు వెల్లడించారు. తెలంగాణలో స్టార్టప్‌లకు, ఐటీ అభివృద్ధికి తమ సహకారం అందిస్తామని వెల్లడించారు. క్లౌడ్ పోర్ట్‌ఫోలియో, డేటా సొల్యూషన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ప్రొడక్టివిటీ టూల్స్‌తో అధునాతన సెక్యూరిటీ వ్యవస్థతో డేటా కేంద్రాన్ని అభివృద్ధి చేస్తామని సత్య నాదెళ్ల వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సానుకూలతలతో త్వరలో మరిన్ని పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నట్లు మంత్రి KTR అన్నారు.