హైదరాబాద్లో ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ కొలువుదీరనుంది. రూ.15వేల కోట్లతో 54 ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ని నెలకొల్పనున్నట్లు మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరీ పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని తమ క్యాంపస్లో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ సమక్షంలో ఈ ప్రకటన చేశారు. ఈ డేటా సెంటర్ ఫస్ట్ పేజ్ కంప్లీట్ కావడానికి 24 నెలల సమయం పుడుతుందని.. పూర్తిస్థాయిలో కార్యకలాపాలు అందుబాటులోకి రావడానికి 2025 అవుతుందని వివరించారు. దేశంలో ఇప్పటికే ముంబై, పుణే, చెన్నై నగరాల్లో డేటా సెంటర్లు ఉన్నాయి.