‘లైగ‌ర్’ కోసం టైస‌న్‌కు అంత రెమ్యున‌రేష‌న్ ఇచ్చారా?

Courtesy Instagram: vijay devarakonda

ప్ర‌పంచ నంబ‌ర్ వ‌న్ బాక్సింగ్ చాంపియ‌న్ మైక్ టైస‌న్‌ను మూవీలో న‌టించేందుకు ఒప్పించ‌డం చాలా క‌ష్టం. కానీ లైగ‌ర్ చిత్ర‌బృందం చాలా క‌ష్ట‌ప‌డి ఈ ప‌ని చేసింది. అయితే ఫ‌లితం మాత్రం శూన్యం. మైక్ టైస‌న్ సినిమాకు ఏమాత్రం ప్ల‌స్ కాలేదు. ఎందుకంటే అత‌డికి ఇచ్చిన పాత్ర అటువంటిది. కానీ ఈ సినిమా కోసం టైస‌న్‌కు రూ.23 కోట్లు చెల్లించార‌ట‌. ఆ డ‌బ్బు మొత్తం వృథా అని ఇప్పుడు ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. దీంతో పాటు డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు, ఎగ్జిబిట‌ర్ల‌కు న‌ష్టాన్ని పూడ్చే ప‌నిలో ఉన్నార‌ట లైగ‌ర్ నిర్మాత‌లు. మొత్తానికి లైగ‌ర్ విజ‌య్‌, పూరీ జ‌గ‌న్నాథ్‌తో పాటు నిర్మాత‌ల‌కు కోలుకోలేని దెబ్బ‌తీసింది.

Exit mobile version