2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌ను ప్రభుత్వం నేడు ప్రవేశపెట్టింది. రూ.2,56,257 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టగా, అందులో రెవెన్యూ వ్యయం రూ.2,08,261 కోట్లు కాగా, మూల ధనం రూ.47,996 కోట్లు ఉంది. ఈ బడ్జెట్‌పై ఈ ఉదయం ఏపీ సీఎం జగన్ సమక్షంలో కేబినెట్ సమావేశం నిర్వహించగా.. బడ్జెట్‌ను కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీలో ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా.. వ్యవసాయ అనుబంధ రంగాలపై బడ్జెట్‌ను మంత్రి కురసాల కన్నబాబు, మండలిలో సాధారణ బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ప్రవేశపెట్టనున్నారు.