జూనియర్ ఫెన్సింగ్ వరల్డ్ కప్ పోటీలకు ఎంపికైన ప్లేయర్లను తెలంగాణ క్రీడలశాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ అభినందించారు. ఈ నెల 7 నుంచి హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో జరిగే పోటీల్లో తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్‌కు చెందిన గౌరి, బేబిరెడ్డిలు ఇండియా టీమ్ తరఫున బరిలోకి దిగనున్నారు. ఈ సందర్భంగా వీరికి క్రీడా శాఖ తరఫున రూ.3.20 లక్షల చెక్కును మంత్రి అందజేశారు. కాగా ఫెన్సింగ్ స్టేట్ మీట్లో పతకాలు సాధించిన వారిని కూడా మంత్రి అభినందించారు.