తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో నిర్వహించే బీర్ఎస్ ఆవిర్భావ సభ నేపథ్యంలో మహబూబాబాద్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. “ 20 మంది బీర్ఎస్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది. 17 నుంచి 20 మంది సిట్టింగ్‌లను మార్చితే బీర్ఎస్కు 100కు పైగా సీట్లు వస్తాయి. నేను వ్యక్తిగతంగా చేసిన సర్వేలో 80 నుంచి 90 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుంది. 15-20 బీజేపీ, 20-25 కాంగ్రెస్‌కు వస్తాయి” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.