తెలంగాణ ఆర్ధిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు నేడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. నేడు అతని పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిన్న రాత్రి అలిపిరి నుంచి కాలినడకన తిరుమల చేరుకున్న మంత్రి, అనంతరం తలనీలాలు సమర్పించి స్వామివారి అభిషేక పూజలో పాల్గొన్నారు.