రైతులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవద్దని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. పవన్ కల్యాణ్ ఎంత సేపు బాబుని సీఎం చేసేందుకు చూస్తున్నారని మండిపడ్డారు. ఇలా ప్రతీది రాజకీయం చేయడం తగదని తెలిపారు. మాట్లాడితే చంద్రబాబు 40 సంవత్సరాల అనుభవం అంటారని.. ఆ 40 సంవత్సరాల చరిత్రలో ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన ఘటనలు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు.