అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణలో మహిళలకు మంత్రి కేటీఆర్ సరికొత్త ఆఫర్ ప్రకటించారు. రాష్ట్రంలో మహిళా పారిశ్రామిక పార్కుల్లో 10 శాతం ఇన్ వెస్ట్ మెంట్ రాయితీ ఇస్తామన్నారు. అందుకోసం కావాల్సిన సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్ లో ఏర్పాటు చేసిన మహిళా పారిశ్రామిక పార్కును ఈ సందర్భంగా కేటీఆర్ ప్రారంభించారు. మహిళా పారిశ్రామిక వేత్తల కోసం వీ హబ్ ఇప్పటికే ప్రారంభించినట్లు గుర్తు చేశారు. కొత్తగా ఉద్యామిక అనే నూతన కార్యక్రమంలో ప్రారంభించినట్లు తెలిపారు. దీని ద్వారా మహిళా పారిశ్రామిక వేత్తల ఫిర్యాదులు, సమస్యలు పరిష్కరిస్తామన్నారు.