నేటినుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమయిన తొలిరోజే బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజాసింగ్ సస్పెండ్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. కిందటేడాది తెరాస మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యే గా ఉన్నారు. మంత్రి కేటీఆర్ ఈటల సీటు వద్దకే వెళ్లి అన్నా బాగున్నావా అంటూ పలకరించారు. రాజకీయాల పరంగా వీరిద్దరు శత్రువులైనా సభలో అంతా ఒకరేనని కేటీఆర్ నిరూపించారు.