తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ నాశనం చేసినట్లు విమర్శించారు. BJPని ఎదుర్కొలేకనే కాంగ్రెస్ తటస్థంగా ఉందని ఎద్దేవా చేశారు. ముందుగా మీరు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేశారా అని ప్రశ్నించారు. పంజాబ్ సహా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ హామీలు నెరవేర్చలేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో బీజేపీ గెలవాలని కాంగ్రెస్ పార్టీనే ఎక్కువగా చూస్తోందన్నారు.