APSRTCలో నూతనంగా కారుణ్య నియామకాలు చేపడతామని మంత్రి పేర్ని నాని వెల్లిడించారు. 1,800 మంది ఉద్యోగుల కుటుంబాలకు ప్రస్తుతం నియామకాలు చేస్తున్నట్లు తెలిపారు. ఆయా జిల్లాల్లోనే జాబ్ ఇస్తామని, ఇప్పటికే జిల్లా పాలనాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. గతంలో ప్రభుత్వానికి, ఇప్పుడున్న ప్రభుత్వానికి చాలా తేడా ఉందని పేర్కొన్నారు. మరోవైపు కేంద్రం అందించే ఆయిల్ ధరలు ఎక్కువగా ఉన్నట్లు విమర్శించారు. దీంతో సంస్థకు నష్టాలు వస్తున్నట్లు గుర్తు చేశారు.