నేడు దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహరావు జయంతి. ఈ సందర్భంగా హైదరాబాద్, నెక్లెస్‌రోడ్‌లోని పీవీ ఘాట్ వద్ద టీఆర్ఎస్ నేతలు నివాళులు అర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాటు పీవీ శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిపిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. తెలుగు బిడ్డ, మాజీ ప్రధానిని కేంద్రం విస్మరించడం బాధాకరం అని మండిపడ్డాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని.. కొత్త సంస్కరణలు తెచ్చి ఆర్థికాభివృద్ధికి తోడ్పడిన పీవీకీ భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశాడు.