మంత్రికి త్రుటిలో తప్పిన ప్రమాదం

Courtesy Twitter:peddireddy

ఏపీ మంత్రి పెద్దిరెడ్డికి త్రుటిలో ప్రమాదం తప్పింది. తిరుపతి సమీపంలో చంద్రగిరి మండలం నడింపల్లి నేషనల్ హైవేపై మంత్రి కాన్వాయ్‌లోని ఓ వాహనం టైరు పేలింది. డివైడర్‌ను ఢీకొని మరో రోడ్డు వైపుకు కాన్వాయ్‌ దూసుకెళ్లింది. అయితే మంత్రి మరో వాహనంలో ఉండటంతో ముప్పు తప్పింది. ప్రమాదం జరిగిన కారులో వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

Exit mobile version