ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను మెరిసింది. లోపాలకు చెక్ పెడుతూ కొలంబియాలో జరిగిన ఛాంపియన్షిప్ సమరంలో మీరాబాయి రజత పతకాన్ని సొంతం చేసుకుంది. మొత్తంగా 200 కేజీల బరువులెత్తి సిల్వర్ మెడల్ని కైవసం చేసుకుంది. కేవలం 6 కిలోల తేడాతో మీరాబాయి రెండో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. 49 కేజీల విభాగంలో పోటీ పడి.. 87కేజీల స్క్వాష్, 113 కేజీల క్లీన్ అండ్ జర్క్ బరువులను ఎత్తింది. మణికట్టు బాధిస్తున్నా మణిపురీ క్రీడాకారిణి 200 కిలోల బరువును ఎత్తగలగడం విశేషం. 2024లో జరిగే ఒలింపిక్స్లో బంగారు పతకం సాధించడమే తన లక్ష్యమంటోది మీరాబాయి చాను.
రజతం సొంతం చేసుకున్న మీరాబాయి

Courtesy Twitter:Medai_SAI