దిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్తో ఓ డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను వేధించడమే గాక కారుతో 10-15 మీటర్ల దూరం లాక్కెళ్లాడు. ఇవాళ తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి, ఓ నిందితుడిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. దిల్లీ AIIMS సమీపంలో మత్తులో ఉన్న వ్యక్తి స్వాతి మాలివాల్తో అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.