రాబోయే రోజుల్లో వన్డే ఫార్మాట్ కనుమరుగవుతుందని మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప అభిప్రాయపడ్డాడు. టీ20లు, టీ10ల క్రేజ్ రోజు రోజుకూ పెరుగుతోందని అన్నాడు. 7 గంటలు కూర్చుని ఎవరికీ క్రికెట్ చూసే ఓపిక లేదని ఉతప్ప అభిప్రాయపడ్డాడు. ఇప్పుడిప్పుడే క్రికెట్ ప్రాచుర్యం పెరుగుతున్న దేశాల్లోనూ లీగ్‌లు చూసేందుకే జనం ఇష్టపడుతున్నారని అన్నాడు.