ట్రైలర్లు, పోస్టర్లతో ఆసక్తి పెంచిన మిస్సింగ్ సినిమా ఈరోజు థియేటర్లలో విడుదలైంది. హర్ష నర్రా, నిక్కిషా, మిషా నారంగ్ (తెల్లవారితే గురువారం ఫేం) ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీని జోస్యుల దర్శకుడు. భజరంగబలి క్రియెషన్స్ బ్యానర్‌పై భాస్కర్ జోస్యుల – లక్ష్మి శేషగిరిరావు నర్రా కలిసి చిత్రాన్ని నిర్మించారు. మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ ఆరశాడ.
అందరు కొత్త నటీనటులతో..డైరెక్టర్ శ్రీని జోస్యుల తెరకెక్కంచిన చిత్రం మిస్సింగ్. కథలో ఏదో థ్రిల్లర్ ఎలిమెంట్ ఉందని అనిపించేలా మొదటి నుంచి ప్రచారం చేశారు. దీంతో ఈ సినిమాలో ఏదో కొత్తదనం ఉండబోతుంది అనుకునేలా చేయడంలో చిత్రబృందం విజయం సాధించారు. మరి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది ఇంతకీ స్టోరీ ఏంటి తెలుసుకుందాం
గౌతమ్ , శ్రుతి కొత్తగా పెళ్లిచేసుకున్న జంట హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తుంటారు. ఇలా సంతోషంగా ఉన్న వారి జీవితాల్లో ఒక విషాద ఘటన చోటుచేసుకుంటుంది. ఒక రోడ్ యాక్సిడెంట్ వాళ్ల జీవితాలను మార్చేస్తుంది. ఆ యాక్సిడెంట్‌లో శ్రుతి మిస్ అవుతుంది. గౌతమ్‌కి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ వస్తుంది. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది. అనుకోకుండా జరిగిందా లేదా ఎవరైనా కావాలని చేశారా..? శ్రుతి ఎందుకు మిస్ అవుతుంది..? షార్ట్ టర్మ్ మెమరీ లాస్ వచ్చిన గౌతమ్ శ్రుతిని ఎలా వెతుకుతాడు..? ఈ స్టోరీలోకి జర్నలిస్ట్ మీనా ఎందుకొస్తుంది..? ఈ అంశాలన్నీ తెరపై చూడాల్సిందే…
డైరెక్టర్ రాసుకున్న స్టోరీ కొత్తగా ఉన్నప్పటికీ..దాన్ని తెరపై చూపించడంలో మరికాస్త శ్రద్ధ పెడితే బాగుండేది. ఫస్టాఫ్‌లో స్టోరీ అంతా నెమ్మదిగా ఎటువంటి కొత్తదనం లేకుండా సాగుతుంది. అయితే సెకండాఫ్‌లో పెట్టిన కొన్ని ట్విస్టులు, కొన్ని డైలాగ్స్ మెప్పిస్తాయి.
సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ నటన విషయానికొస్తే.. హీరో హర్ష నర్రా స్క్రీన్‌పై చూడటానికి బాగున్నాడు. మెమరీలాస్ ఉన్న వ్యక్తిగా నటించేందుకు బాగా కృషి చేశాడు. అయితే నటన పరంగా మరిన్ని స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. హీరోయిన్ నిక్కీషా రంగ్‌వాలా క్యూట్‌గా ఉన్నప్పటికీ ఆమె పరిధి సినిమాలో తక్కువగా ఉంటుంది. ఇక జర్నలిస్ట్‌గా నటించిన మీషా నారంగ్‌కి మంచి పాత్ర లభించింది. రామ్ దత్, ఒక బ్యాడ్ పోలీస్ ఆఫీసర్‌గా.. చత్రపతి శేఖర్ పాత్రలు కథపై ప్రభావం చూపుతాయి.
యాక్టర్స్ అందరూ కొత్తవాళ్లు కావడంతో ఒక ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది. అయితే స్టోరీలో ఉన్న ఎమోషన్స్‌ను పండించడంలో కాస్త తడబడ్డారు. దర్శకుడు శ్రీని జోస్యుల కొత్త కథను రాసుకున్నాడు. కానీ దాన్ని అనుకున్నట్లుగా చూపించడంలో పూర్తిగా విజయం కాలేదు. అయితే ఎటువంటి అంచనాలు లేకుండా సినిమాకు వెళ్లినవారికి సినిమా కొత్తగా అనిపించవచ్చు. రొమాంటిక్ లవ్‌స్టోరీగా ప్రారంభమైన ఈ సినిమా సెకండాఫ్‌కి వచ్చేసరికి థ్రిల్లర్‌గా మారుతుంది. తక్కువ బడ్జెట్‌తో మంచి సినిమా రూపొందించారు. మ్యూజిక్ బాగుంది. పాటలు అలరిస్తాయి. కాన్సెప్ట్, మ్యూజిక్ స్టోరీకి ప్లస్ కాగా.. స్క్రీన్‌ప్లే, అందరూ కొత్తవాళ్లు కావడం సినిమాకు మైనస్‌గా మారింది.
రేటింగ్ 2.5/5
Celebrities Featured Articles Movie News Telugu Movies
Anil Ravipudi: తెలియక రియల్ గన్ గురిపెట్టా.. తృటిలో తప్పింది