AP: తిరుపతిలో ఐదుగురు పదో తరగతి విద్యార్థులు అదృశ్యమైన ఘటన బుధవారం చోటు చేసుకుంది. నెహ్రు నగర్లోని అన్నమయ్య హైస్కూల్లో చదువుతున్న విద్యార్థులు ఉదయం 6 గంటలకు ట్యూషన్స్ కోసమని వెళ్లారు. కానీ, తిరిగి ఇంటికి రాలేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు పాఠశాల సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. తప్పిపోయిన వారిలో ముగ్గురు బాలికలు, ఇద్దరు బాలురు ఉన్నట్లు తెలుస్తోంది.
తిరుపతిలో విద్యార్థులు మిస్సింగ్
