భారత వెటరన్ కెప్టెన్ మిథాలీ రాజ్ తన రిటైర్మెంట్ గురించి కీలక విషయం తెలిపింది. వరల్డ్ కప్ టోర్నీలో సెమీస్లో ఉమెన్స్ టీమిండియా ఓటమి పాలైంది. దీంతో నిరాశ చెందిన తాను భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకోవడానికి ఇది సరైన సమయం కాదని పేర్కొంది. ఏడాది పాటు కష్టపడి సిద్ధమైన ప్రపంచ కప్లో నిరాశ ఎదురైనప్పుడు, దానిని అంగీకరించడానికి సమయం పడుతుందని తెలిపింది. 39 ఏళ్ల మిథాలీ ఆరు ప్రపంచ కప్లలో ఆడిన ఏకైక మహిళా క్రికెటర్ గా రికార్డు సృష్టించింది.