మిత్ర నాకు రూ.5 లక్షలు ఇస్తానంది: స్రవంతి

Courtesy Instagram: Sravanthi chokkarapu

బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. కంటెస్టెంట్స్ ఆటతీరును బట్టి ప్రేక్షకులు ఓట్లు వేస్తూ షోను విజయవంతంగా నడిపిస్తున్నారు. షోలో భాగంగా ఈ ఆదివారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. ఇందులో భాగంగా ముమైత్ ఖాన్, స్రవంతి చొక్కారావు ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేష‌న్ తరువాత ఇచ్చిన ఇంటర్వ్యూలో స్రవంతి ఆసక్తికర విషయం వెల్లడించింది. ఇంట్లోని మిత్ర శర్మ తనకు రూ.5 లక్షలు ఇస్తానని చెప్పిందని తెలిపింది. ఇంట్లో ఉన్నప్పుడు ఎంతో సహాయం చేశానని దానికి కృతజ్ఞతగా ఆ మొత్తం ఇస్తానని చెప్పడం తనకు ఆనందంగా అనిపించిందని పేర్కొంది. అందుకే రెండోసారి హగ్ ఇచ్చినట్లు తెలిపింది.

Exit mobile version