బనానా మామిడి, యాపిల్ మామిడి, బ్లూ మామిడి, టెంకలేని మామిడి, కిలో బరువుండే సీతాఫలం, సీడ్లెస్ నేరేడు ఇలా అరుదైన పండ్లతో సిరుల పంట పండిస్తున్నాడు కాకినాడ జిల్లా రైతు. చేబ్రోలు రైతు నాగేశ్వరరావు తనకున్న నాలుగెకరాల్లోనే వందకు పైగా పండ్లజాతి మొక్కలు పెంచుతున్నాడు. ఇందులోనే అత్యంత అరుదైన ‘మియాజాకి’ మామిడి పండు పండించాడు. అనేక ఔషధ గుణాలుండే ఈ జపాన్ రకానికి మార్కెట్లో కిలో రూ.2.70లక్షల వరకు పలుకుతుంది.