జనసేన అధినేత పవన్కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలో ఏ నియోజక వర్గం నుంచి పోటీచేసినా ఓడిస్తానని కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఈసారి పవన్కళ్యాణ్ కాకినాడ నుంచి పోటీచేస్తానని వచ్చిన వార్తలపై ఆయన ఈ విధంగా స్పందించాడు. సినిమాల్లో హీరోయిజం చేసినట్లు రాజకీయాల్లో కుదరదని పేర్కొన్నాడు. మంత్రి పదవి మీద తనకు ఆశ లేదని, అది అడిగి సీఎంను ఇబ్బందిపెట్టనని స్పష్టం చేశాడు. కాకినాడలో విలేఖరుల సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే ద్వారంపూడి ఈ వ్యాఖ్యలు చేశాడు.
https://youtube.com/watch?v=TF6EjddlxAE