• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ వాయిదా

    తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. వేసవి సెలవుల తర్వాత విచారణ చేస్తామని వెల్లడించింది. జులై 31 నుంచి ప్రారంభమయ్యే వారంలో మిస్‌లేనియస్‌ పిటిషన్ కింద విచారణ జరుపుతామని.. అప్పటివరకు యథాస్థితి కొనసాగుతోందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై స్టే విధించాలని సర్కారు సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.