ఓ చర్చి ఫాస్టర్ పుట్టినరోజుకు హాజరైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రాజయ్య కన్నీరుపెట్టుకున్నారు. తన వయసు 63ఏళ్లు అని ఈ వయసులో తనపై లైంగిక ఆరోపణల చేస్తున్నారని వాపోయారు. ‘ఆ సర్పంచ్ నాకు బిడ్డతో సమానం. రాజకీయంగా ఎదుర్కొలేకే తనపై లైంగిక ఆరోపణలు చేస్తున్నారని కన్నీరు మున్నీరయ్యారు. మాట్లాడుతూ ఒక్కసారిగా భావోద్వేగంతో కుప్పకూలారు. ఆయన అనుచరులు రాజయ్యను ఒదార్చి కేక్ తినిపించారు. జానకీపురం సర్పంచ్ నవ్య ఎమ్మెల్యే రాజయ్య తనను లైంగికంగా వేధించాడని ఆరోపించిన విషయం తెలిసిందే.